KMR: రామారెడ్డి మండలం గిద్దలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కింద లబ్ధిదారుడు నిర్మించుకుంటున్న ఇంటిని పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాన్ని వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో డ్రైనేజీ కాలువలు, రోడ్ల పక్కన పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు పనులను పరిశీలించారు.