TG: ‘పాము తన బిడ్డలను కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే తింటుంది. అదే తరహాలో మనిషీ ప్రవర్తిస్తున్నాడు’ అని HYD సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. కొత్తఏడాది తొలి రోజునే రెండు ఘటనలు ‘అయ్యో పాపం’ అనుకునేలా చేశాయన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పిల్లలను పోషించలేనని మనోవేదనతో పిల్లలకు తల్లి విషం పెట్టగా.. ఏపీలో కన్నతండ్రి తన ముగ్గురు బిడ్డల విషయంలో అదే పని చేశాడని ఎమోషనల్ అయ్యారు.