GDWL: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ రబీ సీజన్లో సరిపడా యూరియా సరఫరా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులతో ఆందోళన చేశారు. షాపుల్లో స్టాక్ లేకుండా యాప్ ద్వారా నమోదు చేయాలని చెప్పి రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సహా నేతలు ఆరోపించారు.