PLD: పెదకూరపాడు మండల పరిధిలోని చిన్న మక్కెన గ్రామంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పట్టాదారు పాస్ పుస్తకాలు శుక్రవారం పంపిణీ చేశారు. గతంలో తప్పు తడకలతో ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర కలిగిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించారు. తహసీల్దార్ ధనలక్ష్మి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య, ముంతాజ్, లీలావతి అధికారులు పాల్గొన్నారు.