నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వద్ద పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న బైక్ రోడ్డుపై వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తు బైక్పై వెళ్తున్న వ్యక్తి సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక యంత్రంతో మంటలను ఆర్పివేశారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.