SDPT: రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌పై గౌరవం, నమ్మకం మరింత పెరిగేలా ప్రజలకు సేవ చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో తెలంగాణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ట్రేసా ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు.