పాకిస్తాన్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జేసన్ గిలెస్పీ తాజాగా వెల్లడించాడు. 2024లో పాక్ కోచ్ పదవి నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందని ఒక నెటిజన్ ప్రశ్నించగా, గిలెస్పీ స్పందించాడు. ‘నాకు కనీస సమాచారం ఇవ్వకుండానే PCB అసిస్టెంట్ కోచ్‌ను తొలగించింది. ఇలాంటి ఎన్నో అవమానకర ఘటనలు ఎదురయ్యాయి’ అని పేర్కొన్నాడు.