HYD: రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు రికార్డు సృష్టించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకునే సమయాన్ని రెస్పాన్స్ టైం అంటాం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సగటు రెస్పాన్స్ టైం 6.53 నిమిషాలుగా నమోదు కావడం విశేషం. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ స్థాయిగా నిలిచి, ప్రజల భద్రతకు ఇది నిదర్శనమన్నారు.