NLG: చిట్యాల పురపాలక పరిధిలోని ఒకటో వార్డు శివనేనిగూడెం శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని స్థానికులు చేస్తున్న ఆందోళనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. శుక్రవారం డంపింగ్ యార్డ్ వద్దకు వచ్చి అఖిలపక్ష నాయకులతో మాట్లాడారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను అలాగే కొనసాగించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.