KMM: బోనకల్ మండలం రాపల్లి గ్రామ బీసీ కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో కాలనీలో నూతన బోరు పంపు పనులను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గరావు, పీసీసీ సభ్యులు కిషోర్ బాబు, ఆత్మ కమిటీ ఛైర్మన్ సాకారంతో పనులు చేపట్టారు.