BHPL: గోరికొత్తపల్లి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా చిన్నకోడెపాకకు చెందిన గట్టు ప్రదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మండల కేంద్రంలో ఉప సర్పంచ్‌లు సమావేశమై ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా కమలాకర్, ప్రధాన కార్యదర్శిగా సాంబయ్య ఎన్నికయ్యారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ.. ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.