AP: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా తూర్పు తక్కెళ్లపాడులో ఎస్సీ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. అనంతరం ముప్పవరం క్యాంపు కార్యాలయంలో CMRF చెక్కులు పంపిణీ చేశారు. దీంతో పాటు లబ్ధిదారులకు రాజముద్రతో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించారు.