కృష్ణా: మోపిదేవి మండలం వెంకటాపురంలో 2 నెలల పసికందు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. 60 రోజుల వయసున్న చిన్నారి మృతదేహం గ్రామ సమీపంలోని చెరువులో ఇవాళ లభ్యమైంది. సమాచారం అందుకున్న చల్లపల్లి సీఐ ఈశ్వర్రావు, ఎస్సై గౌతమ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారి మృతికి గల కారణాలపై పోలీసులు దార్యప్తు చేస్తున్నారు.