నెల్లూరు: నగర పాలక సంస్థ ఇంఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూతన సంవత్సర సందర్భం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు సంబందించిన సమస్యలపై, జిల్లా అభివృద్ధిపై చర్చలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.