ADB: గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ శుక్రవారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎంపీకి గ్రామస్తులు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు తమ సమస్యను ఎంపీకు వివరించారు. దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు.