TG: దుర్గంచెరువు కబ్జా అవాస్తవమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హైకోర్టులో వేలం పెడితే రెండు ఎకరాలు కొన్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ భూములున్నాయని చెప్పారు. తనపై కేసు ఉపసంహరించుకోకపోతే FTLలో కట్టిన ఇళ్ల ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.