W.G: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ప్రభుత్వ పథకం అయినా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకుని రూ. 2 వేల కోట్లు పైగా ఖర్చు చేశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శించారు. తణుకు మండలం కోనాల గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఈ పాసు పుస్తకాలతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని పేర్కొన్నారు.