TG: పాలమూరు- రంగారెడ్డిపై విచారణ చేపట్టాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తుమ్మడిహెట్టి నుంచి మేడిగడ్డకు కేవలం కమీషన్ల కోసమే మార్పు చేశారని ఆరోపించారు. కాంట్రాక్ట్‌ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. కమిషన్ వేసి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని సూచించారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని తెలిపారు.