WGL: మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల AAIకు బదలాయించింది. మార్చిలో PM మోడీ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా స్థానికంగా ప్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం గజానికి రూ.10-12 వేలు ధర ఉండగా, శంకుస్థాపన జరిగితే ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.