SS: మడకశిరలో నూతనంగా ఆర్డీవో కార్యాలయం మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పీసీ గిరి గ్రామ పంచాయతీ రైతులు CM చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మంజునాథ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి కృషితో కార్యాలయం ఏర్పాటు కావడంపై ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.