BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆధ్యాయనోత్సవంలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం జగన్మోహిని అలంకరణ సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ముద్ద మనోహరమైన రూపంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అమృత భాండాగారంతో తో ఉన్న మోహిని రూపాన్ని స్వామివారిని దర్శించి భక్తులు తరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.