NZB: బోధన్ పట్టణంలోని మారుతి మందిరం దుకాణం సముదాయంలోని దుకాణం నంబర్ (1)కి 2 సంవత్సరాల కాలపరిమితికి జనవరి 3న లీజు లైసెన్స్ వేలంపాట నిర్వహించనున్నట్లు ఈవో రాములు తెలిపారు. వేలంపాటలో పాల్గొని వారు దరఖాస్తు ఫారం పూర్తిచేసి రూ.3000/- చెల్లించాలన్నారు. దరఖాస్తు రుసుమ తిరిగి ఇవ్వబడవన్నారు. వేలంపాట రోజున ముందుగా పాటాదారులు రూ.1,00,000/- డిపాజిట్ చెల్లించాలన్నారు.