E.G: రాజానగరం మండలం సీతారామపురంలో ప్రభుత్వం నూతనంగా జారీచేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో జారీ చేసిన పాసుపుస్తకాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.