విశాఖను సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ నృత్య కాంగ్రెస్–2లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి తరహా వేదికను విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. 15 దేశాల ప్రతినిధులు, 12 సెమినార్లు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.