ATP: గుత్తి మున్సిపాలిటీ బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలుగా కందుల హేమలతను నియమించినట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకప్ప శుక్రవారం మీడియాకు తెలిపారు. అనంతరం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. కందుల హేమలత మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. కందుల హిమాలతకు బీజేపీ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానించారు.