NZB: మోపాల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులతో సమావేశం నిర్వహించారు. MPDO రాములు నాయక్ మాట్లాడుతూ.. మోపాల్ మండలంలోని గ్రామాల అభివృద్ధికి సర్పంచులు, ఉపసర్పంచులు కలిసి పనిచేయాలని కోరారు. అదే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిధులను పారదర్శకంగా వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో MRO రేఖ, MPO కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.