ఇటీవల తైవాన్ జలసంధి చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు చేయడంపై అమెరికా స్పందించింది. తైవాన్ విషయంలో చైనా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. తైవాన్‌పై సైనిక ఒత్తిడిని ఆపాలని కోరుతున్నామని, దౌత్యమార్గాలతో ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటారని ఆశిస్తున్నామని US విదేశాంగశాఖ ప్రతినిధి టామీ పిగోట్ తెలిపారు. ఏకపక్షంగా బలవంతపు చర్యలను, బెదిరింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.