KNR: మానకొండూరు జగ్గయ్యపల్లి వద్ద రామగుండం-హైదరాబాద్ ప్రధాన నీటి పైప్లైన్కు భారీ గండి పడింది. సుమారు 50 అడుగుల ఎత్తున నీరు ఎగసిపడటంతో చెట్లు నేలకూలాయి. అధికారులు సరఫరాను నిలిపివేసినప్పటికీ, హైదరాబాద్కు తాగునీటి ముప్పు పొంచి ఉంది. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు సాగుతున్నాయి.