RR: జన్వాడలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు నియో పోలీస్ సమీపంలో నిర్మించ తలపెట్టిన మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనుల పురోగతిపై జలమండలి ఎండి అశోక్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. పనుల స్థితిగతులు, ఎదురవుతున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకుని, వేగంగా పూర్తి చేయాలన్నారు.