TG: అసెంబ్లీలో బిల్లులపై చర్చకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద నిరసన తెలపనున్నారు. రేపటి నుంచి సభకు హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు.