TG: బబుల్ షూటర్ వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు దెబ్బతిన్నదని కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా.. రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. మోసం చేసిన వ్యక్తికే మళ్లీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆంధ్ర నాయకులకు ఉన్న ఐక్యత తెలంగాణ నాయకులకు లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ అన్యాయం చేస్తున్నారన్నారు.