ఈవీఎంల పనితీరుపై తరచూ చర్చ జరుగుతున్న వేళ కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం, దాదాపు 85% మంది ఓటర్లు ఈవీఎంలపై పూర్తి నమ్మకంతో ఉన్నారని తేలింది. ఓటింగ్ మిషన్లతో తమకు ఎలాంటి సమస్య లేదని, అవి పారదర్శకంగానే ఉన్నాయని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలకు ఈ సర్వే చెక్ పెట్టినట్లయింది.