ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్-జు-యే మరోసారి బహిరంగంగా కనిపించింది. తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం ‘కుమ్సుసన్’ స్మారకాన్ని ఆమె సందర్శించింది. కొంతకాలంగా కిమ్ తన కూతురిని అధికారిక పర్యటనలకు తీసుకెళ్తున్నారు. దీంతో భవిష్యత్తులో అధికారిక బాధ్యతలు ఆమెకే అందించనున్నట్లు హింట్ ఇస్తున్నారని దక్షిణ కొరియా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.