మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య 2025 DEC 25న రిలీజైన ఈ సినిమా ఐదు రోజుల్లో రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రూ.70కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.150 కోట్లకుపైగా కలెక్షన్స్ చేయాల్సి ఉంది. అయితే కనీస బడ్జెట్లో 10% కూడా రికవరీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.