TG: సభలో సభ్యులకు సమాన హక్కులుంటాయని, స్పీకర్ హక్కులను కాపాడాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 7 రోజులు సభ నిర్వహణపై BACలో చర్చకు రాలేదన్నారు. అసెంబ్లీలో చర్చపై తెల్లవారుజామున 2 గంటలకు వస్తే ఎప్పుడు సన్నద్ధం కావాలని, సభలో చర్చించే అంశాలను 24 గంటల ముందు పంపాలని కోరారు. సభలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదని, నిరసనలు తెలిపేందుకు మైకు ఇవ్వకుపోవడం సరి కాదన్నారు.