VZM: తెర్లాం మండలంలోని పలు గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. తహశీల్దార్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలోని నెమలాం, చుక్కవలస, నందిగాం గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందించారు. నందిగాంలో జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో ఏఎంసీ ఛైర్మన్ ఎన్.వెంకటనాయుడు పాల్గొన్నారు.