KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లిలో పట్టపగలే బైకు చోరీకి గురైందని గ్రామానికి చెందిన యడవెల్లి నాగరాజు నేడు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో తన ఇంటి ముందు బైక్ను నిలిపి ఉంచారు. తిరిగి వచ్చి చూడగా వాహనం కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు బైక్ను ఎత్తుకెళ్లినట్లు గమనించిన బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.