SKLM: లావేరు మండలం వెంకటాపురం గ్రామంలో రోడ్డు పక్కనే చెత్తాచెదారం పోగులుగా తయారైందని స్థానికులు అంటున్నారు. దీంతో రోడ్డుపై వెళ్తుంటే దుర్వాసన అధికంగా వస్తుందని వారు వాపోతున్నారు. ఇండ్లలోను షాపుల్లోనూ ఉపయోగించే వ్యక్తపదార్థాలను రోడ్డు పక్కనే వేస్తున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి చెత్తాచెదారాన్ని తొలగించి, తగు చర్యలు చేపట్టాలన్నారు.