HYD: సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సన్న బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎల్లారెడ్డిగూడలో రేషన్ దుకాణంలో నిర్వహించిన బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అందజేశారు.