విశాఖపట్నం మధురవాడలోని ఐటీ సెజ్ పరిధిలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర వాణిజ్య శాఖ నిర్ణయం మేరకు, మొత్తం 31.25 హెక్టార్లలో ఉన్న మధురవాడ ఐటీ సెజ్ నుంచి సుమారు 11.59 ఎకరాల భూమిని డీ-నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీయ్యాయి. దీంతో సెజ్ నికర విస్తీర్ణం 19.97 ఎకరాలకు తగ్గింది.