SRD: మండల కేంద్రమైన కంగ్టి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చు చేసిన వివరాలు నిర్ణీత ప్రొఫార్మా 2 ,3 లో వెంటనే సమర్పించాలని పంచాయత్ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మణ్ పంచాయత్ కార్యదర్శులు ఉన్నారు.