JGL: తిమ్మాపూర్ గ్రామంలో ఆరుగురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ లక్ష్యమని, దశలవారీగా ఇళ్ల మంజూరు కొనసాగుతోందని ఆయన తెలిపారు. గ్రామ స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.