HYD: ORR పరిసర ప్రాంతాల్లోని రిజర్వాయర్ల భద్రతకు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతామని HYD జలమండలి ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. రిజర్వాయర్ల చుట్టూ సుందరీకరణ పనులను పలు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, అక్రమ ప్రవేశాలు అరికట్టడం, నీటి నిల్వల రక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.