సీతానగరం మండలం వెదుళ్ళపల్లి శ్రీ బొల్లి మునియ్య మెమోరియల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ‘స్పెల్ బీ’ పోటీలు ఘనంగా నిర్వహించారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు జరిగిన పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. విజేతలను ఉపాధ్యాయులు అభినందించగా, ఈ కార్యక్రమాన్ని ఎంఈవో స్వామి నాయక్ పరిశీలించారు.