TG: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో తమ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.