TG: మూసీ సుందరీకరణ ఫస్ట్ ఫేజ్ పనులను మార్చిలో ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంక్రాంతిలోగా డీపీఆర్‌పై క్లారిటీ వస్తుందన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51కి.మీ. అభివృద్ధి చేస్తామని, ఈ 51కి.మీ. ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. మీరాలం ట్యాంకు కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని పేర్కొన్నారు. ట్యాంకుపై రూ.450 కోట్లతో బ్రిడ్జి కడుతున్నామని పేర్కొన్నారు.