TG: హైదరాబాద్ అభివృద్ధిలో నిజాం రాజుల పాత్ర కీలకమని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు. వారి హయాంలో కట్టిన జంట జలాశయాలే నేటికీ దాహం తీరుస్తున్నాయని తెలిపారు. అయితే, మూసీ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా నరకం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటితో పంటలు నాశనమవ్వడమే గాక, పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారని.. అందుకే మూసీ ప్రక్షాళన చేపడుతున్నామని స్పష్టం చేశారు.