MDK: నర్సాపూర్ మండలం లింగపూర్ గ్రామంలోని ప్రైమరీ స్కూల్ పక్కనే చెత్త వేయడంతో అక్కడ పెద్ద సంఖ్యలో కుక్కలు చేరి రోడ్డుమీదే తిరుగుతున్నాయి. దీంతో స్కూల్కు వెళ్లే పిల్లలు, స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను వెంటనే తొలగించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులను కోరుతున్నారు.