హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఈ సీజన్ తొలి మంచు కురిసింది. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి క్యూ కట్టారు. పలు ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుని కనువిందు చేస్తున్నాయి. న్యూ ఇయర్ వేడుకలను మంచు మధ్య జరుపుకుంటూ సందర్శకులు ఎంజాయ్ చేశారు. జీవితంలో తొలిసారి లైవ్లో స్నో ఫాల్ చూసి మైమరిచిపోయామని, ఆ అనుభూతి మాటల్లో చెప్పలేమని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.