KMM: పెనుబల్లి మండల నూతన తహశీల్దార్‌గా గుగులోతు వీరభద్రం నాయక్ నేడు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ సస్పెన్షన్‌కు గురైన నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న వీరభద్రం నాయక్‌ను ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండలంలో రెవెన్యూ పాలనను పటిష్టం చేస్తామని ఆయని తెలిపారు.